Feeds:
Posts
Comments

ఇటీవల హైదరాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో  ప్రాణాలు కోల్పోయిన రమ్య ఉదంతం బాగా కలచివేసింది.  బంగారు భవిష్యత్ ఉన్న చిన్నారి జీవితంలో  ఏదీ అనుభవించకముందే తిరిగిరాని లోకాలకు చేరుకోవడం విషాదం.  ఈ ఘటనకు దారితీసిన కారణాలు నిజంగా శోచనీయం.. ఏ తల్లిదండ్రులకైనా బిడ్డలే పంచ ప్రాణాలు. వాళ్లు ఏది అడిగినా కాదనలేకపోవడం తప్పుకాదు. కానీ అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఆలోచించకుండా అన్నీ సమకూర్చడం.. అది స్టేటస్ సింబల్ గా భావించడం  మాత్రం క్షమార్హం కాదు.

చదువుకునే పిల్లలకు కాలేజీకి వెళ్లడానికి, రావడానికి లేదా స్నేహితులతో బయటికి వెళ్లడానికి టూ వీలర్ చాలు. అంతకు మించి ఇవ్వగల స్థోమత ఉన్నా అది  ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో చెప్పడానికి చిన్నారి రమ్య ఉదంతమే నిదర్శనం.. ఎలాంటి ప్రమేయం లేకుండా తన బాబాయి, తాత, పట్టుమని పదేళ్లు నిండని రమ్య ప్రాణాలు కోల్పోవడానికి కారణం  ఎవరు? యువకులన్నాక పార్టీలు, పబ్ లు సహజమని వాదించే తల్లిదండ్రులు లేకపోలేదు. తాగమనండి.. చిందేయమనండి.. అలా తాగినప్పుడు ఇంట్లోనే ఉండమని చెప్పండి. రోడ్లమీదికి కారుల్లోనూ బైకుల మీదా  వచ్చి పరుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని  చెప్పండి.. మన వినోదం, సంతోషం వేరొకరికి శాపం కావడాన్ని సమర్థిస్తారా? రమ్య కుటుంబం స్థానంలో ఉండి ఆలోచిస్తేనే వాళ్లు పడిన వేదన, అనుభవిస్తున్న క్షోభ అర్థమవుతాయి.

యువత  కూడా తాత్కాలిక సంతోషం, ఆనందం కోసం దురలవాట్లకు బానిసలు కావడం, అవి ఇతరుల ప్రాణాలను బలి తీసుకునేలా ప్రవర్తించడం ఎంత వరకు సబబో ఆలోచించాలి. సిగ్నల్ పడినా ఆపకుండా వెళ్లడం, రయ్యిమని దూసుకుపోవడం మీకు థ్రిల్ కలిగిస్తుందేమో కానీ మీకేదైనా జరిగితే మీ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చినవారవుతారు.

చాలామంది యువకులు రోడ్డుపై ద్విచక్రవాహనాలు నడుపుతుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తూ ఉంటుంది. వాళ్లు చిన్న సందున్నా చాలన్నట్లు దూసుకువెళ్తుంటే ఎక్కడ స్కిడ్ అయి పడతారో అనిపిస్తుంది. వేగంగా వెళ్లడం, ఫీట్లు చేయడం యువకులు థ్రిల్ కలిగించే అంశమే. కాదనడం లేదు. కానీ దానివల్ల రోడ్డు మీద వెళ్లే  ఇతరులకు ప్రాణాపాయం కలుగుతుందనే ఆలోచన లేకపోవడం నిజంగా దారుణం. ఈ మధ్య  ఒక స్కూల్ లో తల్లిదండ్రులకు నిర్వహించిన కౌన్సెలింగ్ కార్యక్రమంలో చాలా ఆసక్తికరమైన అంశాలను కౌన్సెలర్ ప్రస్తావించారు. ‘‘మా వాడు అలా కాదు.. లేదా మా అమ్మాయి అలా చేయదు’’ అనే నమ్మకం తల్లిదండ్రుల్లో చాలా సహజం. కానీ అది నూటికి 99 శాతం అపోహ మాత్రమే అని ఆమె వివరించారు. దానికి చాలా ఉదాహరణలను కూడా పేర్కొన్నారు.  మగపిల్లలకు బైక్ లేదా కారు ఇస్తుంటే.. వాళ్లు ఎలా నడుపుతున్నారో పక్కనే ఉండి గమనించండి. మీరు లేనప్పుడు వాళ్ల తీరు ఎలా ఉంటుందో తెలుసుకోవడమూ పెద్ద కష్టం కాదు. అతి వేగం అన్ని వేళలా అనర్థదాయకమనే విషయాన్ని వివరించండి. అది రోడ్డు మీద వెళ్లే  ఇతరులకే కాదు మీ పిల్లలకూ ప్రమాదకరమే అనేది విస్మరించకండి.

మీ పిల్లలకు బైక్ ఇస్తున్నప్పుడు వాళ్లు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఎంత బలంగా కోరుకుంటారో సాటి ప్రయాణికులు లేదా రోడ్డు మీద వెళ్లే పాదచారుల గురించి వాళ్ల కుటుంబ సభ్యులు కూడా అలాగే అనుకుంటారు కదా. ప్రాణం  ఎవరికైనా విలువైందే. తిరిగి తెచ్చి ఇవ్వలేనిది.. వెలకట్టలేనిది.. అందుకే కాలేజీ పిల్లలకు బైక్ కొనిచ్చే ముందు అది నిజంగా వారికి అవసరమా? లేక స్నేహితులకు ఉందని అడుగుతున్నారా? మీరూ డబ్బుంది కదా అని కొనిచ్చేస్తున్నారా? బండి నడపటానికి లైసెన్స్, అనుభవం తనకి ఉన్నాయా అనేది ఒక్కసారి ఆలోచించండి.

సామాజిక స్పృహతో.. నిజంగా సమాజానికి సేవ చేయాలి అనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చినవారు ఒక్కరంటే ఒక్కరైనా ఉన్నారా..?
వేసవి వస్తే విద్యుత్ కోత.. తాగునీటి కొరత.. వానా కాలం రోడ్డు మీద కాలు పెట్టాలంటే పరమ పద సోపానం లోని పాములా ఏ మ్యాన్ హోల్ ఎప్పుడు మింగేస్తుందోనని భయం..
ఎటొచ్చీ కాస్త శీతాకాలమేనేమో చలి తప్ప మరే బాధ ఉండనిది..!!
సౌర విద్యుత్ కు అవసరమైన వనరులున్నాయని తెలిసినా దాన్ని ప్రోత్సహించరు..  
జీవకోటికి నీరే ఆధారం అని తెలుసుండీ వర్షపు నీటి వినియోగం పై అవగాహన కల్పించరు..
బోర్లు వేసేసి భూమాత రక్తం పిండేస్తారు..
పచ్చటి చెట్లే ప్రగతికి మూలం అని తెలిసినా విచక్షణ లేకుండా చెట్లు నరికేస్తారు..  
రోడ్డు వేస్తున్నప్పుడే పరస్పర సమన్వయంతో పని చేస్తే కోట్ల ప్రజాధనం వృథా కాదన్న ధ్యాసే ఉండదు..
ప్రతి పనిలో నిర్లక్ష్యం.. స్వార్థం.. అవినీతి..
శుష్క నాయకత్వం.. అధికార అలసత్వం.. వెరసి.. సామాన్యుడి జీవితం అస్తవ్యస్తం..
స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అయినా ఇంకా ఎందుకు అసమానత రాజ్యం ఏలుతోంది..
ఉచిత హామీలకు ఇంకా కాలం చెల్లి పోలేదేం..
విద్య, వైద్యం, కూడు, గూడు లేక ఇన్ని కోట్లమంది అల్లాడుతున్నారేం..
సర్పంచి నుంచి ఎంపీ వరకు.. ఎలాంటి నాయకులను ప్రతినిధులుగా పంపుతున్నాం..
వారు మనకు చేసింది ఏమిటి..  ప్రశ్నించుకోండి..
ఉన్నారా.. ఒక్కరైనా..    
 

      

ఒక కుటుంబం కొన్ని కారణాంతరాల వల్ల  విడిపోవాల్సి వస్తే.. దాని అర్థం ఆ కుటుంబ సభ్యులు  ఇంకెప్పుడు మొహాలు కూడా చూసుకోరని కాదు కదా ! శుభకార్యం జరిగినా కష్టం వచ్చినా కచ్చితంగా కలిసే  పంచుకుంటారు..  నాణేనికి బొమ్మ బొరుసు ఉన్నట్లే  ప్రతి అంశానికి రెండు పార్శ్వాలు ఉంటాయి .. పాజిటివ్,  నెగెటివ్.  అవి మనకు బాధగా కలిగించినా..  కష్టంగా ఉందని అనుకున్నంత మాత్రాన వాస్తవం కాకుండా పోవు.  మానసికంగా దగ్గరితనం లేనప్పుడు భౌతికంగా కలసి ఉన్నంత మాత్రాన సరిపోతుందా?? న్యాయం – అన్యాయం, అభివృద్ధి, వెనకబాటుతనం  గురించి మాట్లాడే సమయం కాదిది.. అయితే మనుషులు ఎక్కడ ఉన్నా.. మనసులు కలిసి ఉండొచ్చు..
అన్నిటికన్నా ముందు రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఇది ఏ ఒక్క ప్రాంత ప్రజల అభీష్టాన్ని మన్నించో గమనించో తీసుకున్న నిర్ణయం కానే కాదు. రాజకీయపరమైన   స్వార్థ పూరిత చర్యలకు సామాన్యులు ఎందుకు బలి కావాలి.. ? ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా జనం కోసం వారి భవిష్యత్ కోసం ఆలోచించి అడుగులు వేయడం చరిత్రలో లేదు. స్పష్టంగా చెప్పాలంటే ఇవన్నీ రాజకీయపరమైన ప్రకటనలు మాత్రమే. విద్యాసంస్థల మూసివేత వల్ల నష్టపోయేది ఎవరి పిల్లలు? ఎవరి జీవితాలకు దెబ్బ? ఉద్వేగాలను అదుపులో పెట్టుకునే విజ్ఞత మనిషికి దేవుడిచ్చిన వరం.  అన్ని చేదు గాయాలను మాన్పగలిగినది  కాలం ఒక్కటే.. ప్రాంతం ఏదయినా మన భాష ఒక్కటే.. మనం తెలుగు తల్లి ముద్దు బిడ్డలం ..

ప్రపంచం లో వేరే ఏ దేశానికీ లేని ప్రత్యేకత  భారత దేశానికి ఉంది ..  ఇక్కడి ప్రజల మతం కలిసిపోవడం.. కొలిచే దైవం ఏదైనా ఆపదలో ఉన్న సాటివాడిని ఆదుకోవడం గొప్ప కార్యంగా భావిస్తారు.. అపరిచితులైనా  ఆకలని వస్తే అన్నం పెడతారు .. అది భారతీయత.. ప్రతి భారతీయుడి మనసూ గర్వపడుతుంది .. తను ఈ నేలపై పుట్టినందుకు ..

Telangana

It’s time to take a decision. Everyone put their eyes towards Delhi. Everywhere going hot discussions about this topic.. what will happen now?? As per media analysis.. Congress have to take loss prevention actions.. So, seriously thinking to put an end to this issue.. However whatever may be it.. Belonging to any place.. all have to remember one thing..

All are Telugu people and primarily Indians..

నాలుగు కోట్లమంది ఎదురుచూస్తున్న తెలంగాణా అంశం చివరిదశలో ఉందా?
అవునని అన్ని వర్గాల ఊహాగానాలు..
హైదరాబాద్ నుంచి హస్తిన దాకా వాడి వేడి చర్చలు ..
కాంగ్రెస్ చేపట్టిన నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ప్రస్తుత పరిణామాలు చోటు చేసుకున్నాయని మీడియా విశ్లేషణ.. భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకుని ఏదో ఒక నిర్ణయానికి రాక తప్పదని అందరికీ అర్థం అయిపోయింది. అందుకే.. ఎవరి ప్రయోజనాలను వారు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరికొత్త డ్రామాలకు తెర తీస్తున్నారు.. ప్రాంతం ఏదయినా.. ఏ పేరుతో పిలిచినా.. అంతిమంగా అందరం తెలుగువారమని.. భారతీయులమని గుర్తుంచుకుంటే అదే పదివేలు..

నులి వెచ్చటి వెలుగులు పంచే సూర్యుడు..
వెన్నెల పూలు విరబూసే జాబిలి…
చిరుజల్లులతో పుడమికి పులకరింత కలిగించే మేఘాలు..
చినుకు తాకితే పరవశించే నేల తల్లి..
ఎంత అదృష్టవంతులో.. ఏ వత్తిడికి లొంగకుండా..
తమ పని తాము చేసుకుపోతాయి..!

ఎన్నో అనుకుని ఏదీ చేయకుండానే ఈ రోజుతో అయిదు నెలలు గడిచిపోయాయి..
అశ్చర్యపడటం లేదు కానీ ఇలా ఎన్నాళ్లని మనసు నిలదీస్తోంది..
అల్మారాలో చదవాల్సినవి కొనాలని అనుకున్నవి.. ఎన్నో..

ఈ పుస్తక సమీక్ష ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితం అయ్యి దాదాపు మూడు వారాలు కావస్తోంది.. కొంచెం బద్ధకం.. ఎక్కువ కదా.. ఇవ్వాల్టికి తీరికి దొరికింది.. కలం మాత్రమే మన చేతిలో.. కాలం కాదు కదా.. 🙂

రుణ విముక్తి

అమృతం లాంటి అమ్మ గొప్పతనం గురించి ఎంత మంది చెప్పినా.. ఎన్ని విన్నా అదేంటో ఎప్పటికప్పుడు కొత్త సత్యాలు తెలుస్తూనే ఉంటాయేమో.. అవును అమ్మ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది.. కాదు కాదు.. మనమే ఆమెని పూర్తిగా అర్థం చేసుకోవడం లేదు.. ఇలా ఎందుకు అన్నానో.. తెలుసుకోవాలి అంటే..

కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ఫ్రెండ్ కుశల ప్రశ్నల తర్వాత ఓనర్ ఇల్లు ఖాళీ చేయమన్నారని చెప్పింది..

కారణం.. తులసి చెట్టు.. నిజమేనండి… ఓనర్ కి పదేళ్ల కొడుకున్నాడు. రోజు క్రికెట్ ఆడుతూ.. తులసి చెట్టుని బాల్ తో కొట్టడం.. ఆకులన్నీ.. రాలిపోవడం… తులసి అంటే ఎంత పవిత్రంగా భావిస్తామో తెలుసు కదా.. తన చర్య మా ఫ్రెండ్ ని, వాళ్ల ఆయన్ని బాధించింది.. చాలా సార్లు.. ఆ పిల్లాడికి చెప్పి చూసినా ఫలితం శూన్యం.. తండ్రి లేని పిల్లడు అని వీళ్ళకి కూడా సాఫ్ట్ కార్నర్..

చివరికి ఒక రోజు బాబు వాళ్ల అమ్మతో చెప్పారట.. పది నిమిషాల్లో మెస్సేజ్.. ఇల్లు ఖాళీ చేయమని..

ఓకే.. రెండు నెలల గడువుంది కాబట్టి.. ఇల్లు చూసుకుని వెళ్లి పోతారు.. అది కాదు మా ఫ్రెండ్ బాధ.. బాబు వాళ్ల నాయనమ్మ గురించి.. అదేమిటి అంటే.. తన మాటల్లోనే తెలుసుకోవాలి..

“తల్లి కూడా చేయదేమో అనిపించేలా సేవలు చేస్తుంది కోడలికి.. పని వాళ్లు ఉన్నా ప్రతి పని ఆవిడే చూసుకుంటారు.. బాబుకి అన్నం తినిపించడం దగ్గరి నుంచి కోడలికి జడవేయడం వరకు.. అన్నీ.. కోడలి మనసు నొచ్చుకోకుండా అన్నీ అమర్చి పెడుతుంది.. ఎందుకు అమ్మా ఇలా అంటే.. కొడుకు కోసం అన్నదే ఆవిడ జవాబు.. (ఆమెకి ఇద్దరు కొడుకులు.. ఒకరు లండన్ లో ఉన్నారు.. ఇంకొకరు ఈ బాబు వాళ్ల నాన్న. చిన్నో పెద్దో తెలియదు కానీ.. రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతడు వెళ్తూ అన్న మాటలనే ఆవిడ జ్ఞాపకం ఉంచుకుంది.. ) నా కొడుకు చివరిసారిగా చెప్పిన మాట “అమ్మా..! నా పిల్లలు జాగ్రత్త” అని నాకే అప్పగించి వెళ్ళాడు.. నేను చూసుకోకపోతే ఎలా? అన్నది ఆ తల్లి చెప్పే సమాధానం.. అవును.. అయితే ఏంటి.. అనుకుంటున్నారా.. ఉంది..

లండన్లో ఉన్న కొడుకు రమ్మని గొడవ చేసినా గడపదాటని తల్లి తన పెదవి దాటనివ్వని మాట ఏమిటి అంటే.. చనిపోయింది ఆమె సొంత కొడుకు కాదు (ఈ మాట ఆ మహాతల్లి ఎప్పుడు బయట పెట్టలేదని మా ఫ్రెండ్ చెప్పింది.. వాళ్ల బంధువులెవరో మాటల సందర్భంలో చెప్తే తెలిసిందట) కడుపున పుట్టిన బిడ్డల్నే కాదు పొమ్మనుకుంటున్న రోజులలో కేవలం పెంచిన మమకారం ఆమెను కట్టివేసింది. కొడుకు కోసం ఆమె నిశ్శబ్దం గా అన్ని మాటలు బాధలు భరిస్తోంది అంటే.. నిజంగా ఆమె అమృత మూర్తి.. కాదంటారా..??

ఆ ఇంటి కన్నాఅలాంటి పెద్దావిడని వదిలి వెళ్లడం అంటే.. విన్న నాకే మనసుకి కష్టంగా అనిపించింది.. మా ఫ్రెండ్ సంగతి వర్ణనాతీతం.. కానీ.. ఇల్లు ఖాళీ చేయక తప్పదు అని తెలిసి పోయింది.. ఎందుకు అంటే.. ఓనర్ కొడుకు మీద ఈగ వాల నివ్వదట.. మంచిదే.. పిల్లలని ప్రేమగా చూడాలి.. తప్పు లేదు.. కానీ.. తప్పు చేస్తున్నప్పడు వద్దు అని చెప్పక పోగా ఆ మాట అన్నవాళ్ళ మీద కోపం పెంచుకోవడం మూర్ఖత్వం అనుకోవాలో.. జాలి పడాలో అర్థం కాలేదు.. ఒకే ఇంటిలో రెండు భిన్న ధ్రువాలు.. ఒకరిది హిమాలయాల కన్నా చల్లని మనసు.. ఇంకొకరు.. ప్చ్..

తెల్లారి లేచింది మొదలు ఉరుకులు పరుగులు మళ్లీ ఏ అర్ధరాత్రో నిద్రపోయే దాకా…

ఎంత కాలం.. ఇలా.. ఒక గమ్యం ఒక లక్ష్యం ఏదీ లేదా..?

అట్టడుగు నుంచి మనసు.. ప్రశ్న..

నువ్వు కాసేపు ఊరుకుంటావా.. కసిరేస్తాం.. పాపం చిన్నబుచ్చుకుంటుంది..

నేనిప్పుడు ఏమన్నానని అంటూ నసుగుతుంది.. ఉహు.. మనకు బ్రహ్మ చెవుడు!

ఏమైంది ఇవ్వాళ..? అంత కోపంగా ఉన్నావ్..?

శ్రీమతి / శ్రీవారి.. ప్రశ్న.. మౌనమే శరణ్యం..

తెలిస్తే కదా.. చెప్పడానికి!

నాన్నా/ అమ్మా..! వచ్చేటప్పుడు చాక్లెట్ తెస్తా అన్నావుగా.. బుజ్జిగాడు /చిట్టి తల్లి

కరుకైన ఒక చూపే జవాబు.. గప్ చుప్..

అరె.. సినిమాకి వెళ్దాం మిత్రుడి పలకరింపు..

నువ్వెళ్ళు..

మూడే అక్షరాలు..

చాలు అవతలివాడికి మనం ఎలా ఉన్నామో.. అర్థం అయిపోతుంది

నిశ్శబ్దం నీకు నాకు మధ్య.

తర్వాతెప్పుడో.. జ్ఞానం మేలుకుంటుంది..

ఫలితం…. గుండు సున్నా..

ఇంకెప్పుడు విచారంగా ఉన్నావేమని మన అర్ధభాగం అడగక పోవచ్చు..

అయిదు ఫైవ్ స్టార్లు నాలుగు డైరీ మిల్కులు తెచ్చినా గుమ్మంలో బంగారు తల్లి ఎదురు చూడదు..

ఎదురుపడినా.. హాయ్ బాయ్ తప్ప ఏరా మామా/ బావా అనే వాడే ఉండడు..

అబ్బ.. ఎంత హాయి.. ఎన్ని లక్షలు పోస్తే.. దొరుకును ఇంత ఆనందం ఎంజాయ్.. బాస్..!
చిరునవ్వుల విరజాజులు ఉండవ్..

ముద్దు లొలికే వెన్నెల జల్లులు ఉండవ్..

పలకరింపు.. పరిమళాలు.. ఉండవ్..

ఉన్నదల్లా ఒక్కటే….

నువ్వు @ నీ లోకం!!